హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతుంది. గురువారం ఉదయం 9 గంటలకు జైపూర్ నుంచి బయల్దేరిన సీఎం ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ పలు కేంద్ర మంత్రులతో సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్రం 5.30 గంటలకి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాత్రి 7 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సీఎం భేటీ కానున్నారు. రాత్రి 7.30 గంటలకు నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.