calender_icon.png 16 February, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

15-02-2025 10:22:43 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పార్టీకి సంబంధించిన కీలక విషయాలను కేంద్ర నాయకత్వంతో చర్చించనున్నారు. ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలోనే(Revanth Reddy Delhi Tour) బస చేయనున్నారు. టీపీసీసీ పునరుద్ధరణ, కేబినెట్ విస్తరణ(Cabinet expansion),  నామినేటెడ్ ప్రభుత్వ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడం, ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడం వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్‌(Telangana Congress )ను బలోపేతం చేయడానికి వ్యూహాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించడానికి రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ వంటి అగ్ర నాయకులతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులు,  తెలంగాణలో కీలక కార్యక్రమాలకు నిధుల కేటాయింపుకు సంబంధించిన ప్రాతినిధ్యాలను సమర్పించడానికి ముఖ్యమంత్రి కొంతమంది కేంద్ర మంత్రుల(Union Ministers)ను కూడా కలవనున్నారు.

మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్‌ను ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా నియమించిన తర్వాత రేవంత్ రెడ్డి పర్యటనకు ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది. కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరుగుతున్న పునరుద్ధరణలో భాగంగా టీపీసీసీ( Telangana Pradesh Congress Committee)కి నలుగురు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని ఏఐసీసీ (All India Congress Committee) హైకమాండ్ యోచిస్తోందనే ఊహాగానాలు కూడా జోరుగా సాగుతున్నాయి.