calender_icon.png 26 December, 2024 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన సీఎం సంకల్పయాత్ర

08-11-2024 05:18:11 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన సంకల్పయాత్ర ముగిసింది. అనంతరం యాదాద్రి జిల్లాలోని ధర్మారెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన మూసీ పునరుజ్జీవన సభా స్థలికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సభా స్థలి నుంచి ఆయన ప్రసంగిస్తారు. సంగెం నుంచి మూసీ పునరుజ్జీవన సంకత్పయాత్రను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ ధర్మారెడ్డి కాలువ వెంట పాదయాత్ర చేసి నాగిరెడ్డిపల్లి వరకు చేసి ముగించారు.

సంగెం వద్ద ప్రసిద్ధ శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ యాత్రను సుమారు 2.5 కిలోమీటర్ల మేర సాగింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మూసీ నదిలో బోట్లో ప్రయాణం చేశారు. తరువాత సీఎం స్వయంగా ఓ బాటిల్ లో మూసీ నీటీని తీసుకొని పరిశీలించారు. మూసీ పునరుజ్జీవన యాత్రలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, భారీగా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.