హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ముంబయి బయల్దేరారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ముంబయిలో తెలుగు ప్రజలు ఉండే ప్రాంతాల్లో సీఎం ప్రచారం చేయనున్నారు. తెలంగాణ, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల పాలనపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంయుక్తంగా నిర్వహిస్తున్న విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ ఆరోపణ జరిగింది.