calender_icon.png 2 November, 2024 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు వీసీలతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

02-11-2024 12:26:12 AM

  1. యూనివర్సిటీల అభివృద్ధిపై చర్చ
  2. త్వరలోనే అంబేద్కర్, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలకు వీసీల ప్రకటన
  3. కాస్త ఆలస్యం కానున్న జేఎన్టీయూ వీసీ నియామకం

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్లతో సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సమావేశం కానున్నారు. సీఎం నివాసంలో భేటీ కానున్నట్లు తెలి సింది. వీసీలతోపాటు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మ న్, వైస్ చైర్మన్లు కూడా ఈ సమా వేశానికి హాజరు కానున్నారు.

విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాభివృద్ధిపై వీసీలతో సీఎం చర్చించనున్నారు. తెలం గాణలోని 11 యూనివర్సిటీలకు ఇటీవల నూతన వైస్ ఛాన్స్‌లర్లను ప్రభుత్వం నియమించింది. తొలుత బాసర ట్రిపుల్ ఐటీ, కోఠి మహిళా యూనివర్సిటీలకు వీసీలను ప్రభుత్వం నియిమించింది. ఆతర్వాత హార్టికల్చర్, అగ్రికల్చర్ వర్సిటీలతోపాటు విద్యాశాఖ పరిధిలోని ఏడు యూనివర్సిటీలకు అక్టోబర్ 18న వీసీలను ప్రభుత్వం నియమించింది.

అలాగే ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొ.బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్‌గా ఐ.పురుషోత్తంను నియమిం చింది. అయితే ఇప్పటికే రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో నూతనంగా నియమితులైన వీసీ లు, ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్‌లు సమావేశమై ఉన్నత విద్య, యూనివర్సిటీల అభివృద్ధిపై చర్చించారు.

సీఎంతో ఇంతవరకూ వీరు భేటీ కాలేదు. దీంతో నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా సీఎంతో వీరు భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగ అవకాశాలు లభించే కోర్సులు, ప్రొఫెసర్ల రిక్రూట్‌మెంట్, యూ నివర్సిటీల్లోని సమస్యలపైన చర్చించనున్నారు. 

వారంలో ఆ వర్సిటీలకు వీసీల ప్రకటన..

పెండింగ్‌లో పెట్టిన మూడు యూనివర్సిటీలకు వీసీలను త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే తొలుత అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, తర్వాత జవహర్‌లాల్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీలను ప్రకటించనున్నారు. జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీకి మాత్రం కాస్త సమయం తీసుకోనున్నట్లు విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

జేఎన్టీయూ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వీసీల ఎంపికకు సంబంధించిన సెర్చ్ కమిటీల సమావేశాలు పూర్తయ్యాయి. కానీ ఇంకా ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ సెర్చ్ కమిటీ ఇంతవరకూ జరగలేదు. త్వరలోనే ఈ సెర్చ్ కమిటీ సైతం సమావేశమై ముగ్గురి పేర్లను ప్రతిపాదించనుంది. జేఎన్టీయూ వర్సిటీ వీసీ ఎంపిక విషయంలో ఇంతవరకూ ఫైనల్ పేరు ఖరారు కాలేదు.

వీసీల ఎంపికకు సంబంధించి ఇటీవల జరిగిన సెర్చ్ కమిటీ సమావేశంలో ముగ్గురి పేర్లు ఒకే సామాజిక వర్గానికి చెందినవే వచ్చినట్లు తెలిసింది. ఆ ముగ్గురు కూడా బలమైన సామాజిక వర్గం నుంచే ఉండడం, అందులో ప్రభుత్వం సూచించిన పేరు లేకపోవడంతో జేఎన్టీయూ వీసీ ప్రకటన కాస్త ఆలస్యం కానున్నట్లు తెలిసింది. తొలుత ఆ రెండు, ఆ తర్వాత జేఎన్టీయూ వర్సిటీ వీసీలను ప్రకటించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.