హైదరాబాద్,(విజయక్రాంతి): వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల,ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం సమావేశం అయ్యారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలోని ఆరు దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చాయి. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మాతో, రెడ్డీస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్య్ తో ఎంవోయూలపై ప్రతినిధులు సంతకాలు చేశారు. తెలంగాణలో ఆరు కంపెనీలు దాదాపు రూ.5,260 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.
ఈ ఫార్మా కంపెనీల ఏర్పాటుతో 12,490 మందికి ఉపాధి అవకాశాలు లభించునున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన ఫార్మా సిటీలో ఈ సంస్థలకు అవసరమైన యూనిట్లు ఏర్పాటుకు స్థలం కేటాయించనుందని, ఫార్మా సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తమ కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాలు కాలుష్య రహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.