28-04-2025 01:50:49 PM
పార్టీలో ఓపికగా ఉంటేనే పదవులు వస్తాయ్
సంపాదన ఉన్నవారికంటే.. సబ్జెక్ట్ ఉన్నవాళ్లకే ప్రాధాన్యత
హైదరాబాద్: అధికారుల విషయంలో ప్రభుత్వం కొంత సమన్వయం పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. అందరూ మన వాళ్లు ఉండరు.. మనవాళ్లుగా మార్చుకోవాలని ఆదేశించారు. భూ భారతి(Bhu Bharati), ధరణిపై నవీన్ మిట్టల్(Navin Mittal)కు పూర్తి అవగాహన ఉందని సీఎం స్పష్టం చేశారు. అవగాహన ఉన్న నవీన్ మిట్టల్ ను బదిలీ చేయలేమని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. సంపాదనే మార్గంగా కొందరు అధికారులు ఉన్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి సంపాదనే మార్గంగా ఉన్న వారికంటే సబ్జెక్ట్ ఉన్న వాళ్లకే ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయని నేతలకు హామీ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పార్టీ నేతలే నష్టపోతారని సీఎం మందలించారు.
మాజీ మంత్రి కె జానారెడ్డితో ముఖ్యమంత్రి భేటీ
తెలంతాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కె. జానారెడ్డి(Former Minister K. Jana Reddy), ప్రభుత్వ సలహాదారు కే. కేశవ రావుతో చర్చలు జరిపారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం కలిగిన జానారెడ్డి(Jana Reddy)తో భేటీ అయ్యారు. శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొ. హరగోపాల్ తో పాటు పలువురు ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి మావోయిస్టులతో చర్చలు జరిపే అంశంపై ఒక వినతి పత్రాన్ని అందించారు. ఈ విషయంలో కేంద్రంతో సంప్రదింపులు జరపాలని కమిటీ ప్రతినిధులు కోరారు. నక్సలిజాన్ని ఒక సామాజిక కోణంలో చూస్తున్నందున ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్లొచ్చనే అంశంపై జానారెడ్డి, కేశవరావుతో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు.