calender_icon.png 1 April, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

31-03-2025 01:11:27 AM

  1. మంత్రివర్గ విస్తరణ, సంక్షేమం, అభివృద్ధిపై చర్చ
  2. 2 గంటల పాటు సుదీర్ఘ సమావేశం
  3. ఏప్రిల్ 3న విస్తరణ ఉండే అవకాశం?

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మతో సుమా రు 2 గంటల పాటు భేటీ అయ్యారు. ఉగాది శుభాకాంక్షలు చెప్పడంతో పాటు రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు తెలిసింది.

ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, పలు బిల్లులకు సంబంధించిన అంశాలపై చర్చిం చినట్లు సమాచారం. క్యాబినెట్ విస్తరణకు గవర్నర్ సమయం కోరినట్లుగా టాక్ వినిపిస్తోంది.  రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితు ల దగ్గర నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

కాగా, ఇటీవలనే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి..అధిష్ఠానం పెద్దలతో సమావేశమై మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పుతో పాటు నామినేటెడ్ పదవులు భర్తీపై చర్చించారు.

అయితే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌తో సమావేశం కావడం, అది కూడా 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడం  ప్రాధాన్యం సంతరించు కున్నది. రాజ్‌భవన్‌కు సీఎం రేవంత్‌తో పాటు మం త్రి కొండా సురేఖ, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులున్నారు. 

ఏప్రిల్ 3న విస్తరణ..?

కాగా, ఏప్రిల్ 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరు గుతోంది. ప్రభుత్వంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా, ఇందులో నాలుగిం టిని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోం ది. ఈ మేరకు మంత్రివర్గ విస్తరణలో నలుగురికి చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తు న్నాయి.

ఆశావాహుల పేర్లను అధిష్ఠానానికి పంపినట్లు ప్రచారం జరుగుతోంది. తమ తమ వర్గాలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని మాదిగ, లంబాడీ, బీసీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు గతంలో అధిష్ఠానానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. మంత్రి పదవులు దక్కని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ పదవులు ఇవ్వాలని అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.