calender_icon.png 27 December, 2024 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైటీడీఏ అధికారులతో సీఎం సమావేశం

08-11-2024 02:52:29 PM

యాదాద్రి: యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ) అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఆలయ అభివృద్ధితో పాటు పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. మంత్రులు తుమ్మ, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ హాజరయ్యారు. సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి, ప్రస్తుతం జరుగుతున్న పనులపై సీఎం ఆరా తీశారు. ముఖ్యమంత్రి శుక్రవారం యాదాద్రికి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సీఎం దర్శించుకున్నారు. గర్భాలయంలో పంచనారసింహులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు సీఎంకు చతుర్వేద ఆశీర్వచనం ఇచ్చారు.