calender_icon.png 10 January, 2025 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలమండలి అధికారులతో ముగిసిన సీఎం భేటీ

03-01-2025 05:14:55 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): జలమండలి(Water Board) అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం ముగిసింది. బోర్డు ఛైర్మన్ హోదాలో తొలిసారిగా జలమండలి అధికారుతో శుక్రవారం సీఎం భేటీ అయ్యారు. నగర ప్రజల తాగునీటి అవసరాలు, జల మండలి పని తీరు, అమలు చేయాల్సిన ప్రాజెక్టుల పై సమీక్ష నిర్వహించారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని మంచినీటి సరఫరాకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సూచించారు. 

2050 నాటికి అవసరాలకు సరిపడా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసి గోదావారి ఫేజ్-2 ప్రాజెక్టులపై చర్చించారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి నీటి సేకరణపై చర్చించిన సీఎం నగర అవసరాలకు 20 టీఎంసీలు తెచ్చుకునేలా మార్పులకు ఆమోదం తెలిపారు. మంజీరా పైపులైన్ కు ప్రత్యామ్నాయ పైపులైన్ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నగరంలో ప్రజలకు సమర్థవంతంగా మంచినీటి సరఫరా చేసే ప్రణాళికలపై చర్చించడం జరిగింది.