04-03-2025 01:28:10 PM
న్యూఢిల్లీ: కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ(Union Civil Supplies Minister Pralhad Joshi)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రిఉత్తమ్ కుమార్ రెడ్డి సుమారు అరగంటపాటు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇవ్వనున్న రేషన్ కార్డులు, ధాన్యం సేకరణపై చర్చించారు. 2014-15 ఏడాదికి సంబంధించి ధాన్యం బకాయిలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం బకాయిలు రూ. 1,468.94 కోట్లు ఇవ్వాలని సీఎం, మంత్రి కేంద్రమంత్రిని కోరారు. పీఎంజీకేవై బకాయిలు రూ.343.27 కోట్లు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్ డెలివరీ గడువు పెంచాలని కోరినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మళ్లీ ప్రహ్లాద్ జోషి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. ప్రహ్లాద్ జోషికి అత్యవసర సమావేశం ఉండటంతో సీఎం, మంత్రి మరోసారి భేటీ కానున్నారు.