26-02-2025 05:18:26 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన(CM Revanth Reddy Delhi Tour) ముగించుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి ఐదు విజ్ఞప్తులు చేశారు. మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణ, రిజనల్ రింగ్ రోడ్, ఐపీఎస్ కేడర్ల పెంపు, రీజినల్ రింగ్ రైల్, డ్రైపోర్ట్‌లు ఈ ఐదు రాష్ట్ర విజ్ఞప్తులకు కేంద్ర కేబినెట్ ఆమోదం అవసరమని సీఎం తెలిపారు. మెట్రో విస్తరణ కేంద్ర కేబినెట్ ముందుకు రాకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అడ్డుకున్నారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ ఐదు ప్రాజెక్టులు సాధిస్తే కిషన్ రెడ్డికి గండపెండేరం తొడుగుతా అని సీఎం చెప్పారు. పదేళ్లుగా ఎస్ఎల్బీసీ పనులు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్(Congress)కు పేరొస్తుందనే దురుద్దేశ్యంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పనులు(SLBC Project Works) చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్ట్ పనులు మళ్లీ మొదలయ్యాయని, ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలిపోయి ఎనిమిది మంది కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం కొన్ని రక్షణ బృందాలను రంగంలోకి దింపి క్కుకున్నవారిని కాపాడేందుకు యత్నిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జరిగింది.. ప్రమాదం అని, కానీ కాళేశ్వరంలో జరిగింది డిజైన్, నిర్మాణ లోపంతో జరిగిన దుర్ఘటన అని రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ కు మెట్రో రావడానికి ప్రధాన కారకుడు జైపాల్ రెడ్డి కానీ, కేసీఆర్ వచ్చాక మెట్రో కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. మెట్రో విస్తరణపై కేసీఆర్ పదేళ్లు తాత్సారం చేశారని, ప్రతినెల ఒకటో తేదీకి రూ.22500 కోట్లు అవసరం అని, రాష్ట్రంలో ప్రస్తుతం ఆదాయం రూ.18500 కోట్లు మాత్రమే ఉందని సీఎం పేర్కొన్నారు. జీతాలకు రూ.6500 కోట్లు.. వడ్డీలకు రూ.6800 కోట్లు కడుతున్నామని, ఆదాయం రూ.22 వేల కోట్లకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.