25-02-2025 04:30:31 PM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana Chief Minister Revanth Reddy) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ స్టేట్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. హెచ్ఐసీసీలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో ఉన్న సానుకూల వాతావరణం, పెట్టుబడులకు కల్పించిన అనుకూల పరిస్థితులను వారికి వివరించారు. తెలంగాణలో పరిశ్రమలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ట్రేడింగ్, ఇతర రంగాల్లో పెట్టుబడులు, అవగాహనా ఒప్పందాల విషయంలో సమావేశంలో చర్చించారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు క్వీన్స్ ల్యాండ్ ప్రతినిధులు(Queensland representatives) సానుకూలంగా స్పందించారు. ఈ చర్చల్లో క్వీన్స్‌లాండ్ గవర్నర్ డాక్టర్ జెన్నెట్ యంగ్(Queensland Governor Jeannette Young), క్వీన్స్‌ల్యాండ్ ఆర్ధిక, వాణిజ్య, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి రోస్లిన్ బేట్స్ తో పాటు ఇతర ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్రతిష్టాత్మకమైన ‘బయో ఆసియా -2025’(Bio Asia 2025 Summit) రెండు రోజుల (22ndEdition) సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ప్రారంభించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)తో కలిసి పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మకమైన సదస్సుకు ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, దేశీయ సంస్థలతో పాటు ఆ రంగంలో నిపుణులు, నిష్ణాతులు హాజరయ్యారు.