calender_icon.png 23 February, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శం

22-02-2025 03:30:12 PM

కులగణనను న్యాయపరంగా, చట్టపరంగా చేశాం

రాహుల్ గాంధీ ప్రధాని అయితే.. అన్ని రాష్ట్రాల్లో కులగణన

దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిన అవశ్యకత 

హైదరాబాద్: బీసీ కులగణనపై అనుమానాల నివృత్తికి తెలంగాణ ప్రభుత్వం సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ... రాష్ట్రంలో దాదాపు 25 రోజులు పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట ఇచ్చిన తర్వాత ప్రజలు మనకు అధికారం ఇచ్చారని సూచించారు. అధికారిక కార్యాచరణకు అధికార బృందాన్ని వేశామన్నారు. బిహార్, కర్నాటక వివిధ రాష్ట్రాల అధికారుల బృందాన్ని నిర్వహించామని సీఎం స్పష్టం చేశారు. కులగణన(Telangana caste census)లో మూడు రోజులు ఇండ్ల వివరాలు సేకరించామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కులగణనకు ప్రభుత్వంలోని 15 శాఖలకు చెందిన అధికారులను నియమించామని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తం 8 పేజీలో ఇంటి యజమాని ఇచ్చిన సమాచారాన్ని సేకరించామని తెలిపారు. 36 వేల మంది డేటా ఆపరేటర్లను అదనంగా నియమించామన్నారు. ఎన్ రోలర్ గా సమాచారం సేకరించిన వారే డేటా ఎంట్రీ చేశారని వివరించారు.

దాదాపు కోటి 12 లక్షలకు పైగా కుటుంబాలు కులగణనలో పాల్గొన్నాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కలగణన ప్రయత్నమే చేయలేదు, కులగణనను న్యాయపరంగా చట్టపరంగా చేశామని ఆయన వెల్లడించారు. 96.9 శాతం జరిగింది.. 3.1 శాతం సర్వే రాలేదన్నారు. ఇంత పారదర్శకంగా కులగణన చేపడుతున్న కొంతమంది నాయకులు ఇంకా చేయించుకోలేదని ఆరోపించారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 4 కేటగిరీలుగానే జనాభా శాతాన్ని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే 5 కేటగిరీలు ఉన్నాయన్నారు. ముస్లింలో ఓబీసీలను కేసీఆర్ ప్రభుత్వం విడిగా చెప్పలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గుజరాత్ లో కూడా ఓబీసీ ముస్లింలు ఉన్నారని ప్రధాని మోడీ చెప్పారు. బీసీల లెక్క తేలితే మాకేంటి.. అని ఆ వర్గం అడుగుతారని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు భయపడుతున్నాయని ముఖ్యమంత్రి చురకలంటిచారు. చారిత్రాత్మకమైన, సాహసోపేతమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుందన్నారు. భవిష్యత్ లో కులగణన విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం తెలిపారు.

రాహుల్ గాంధీ ఆశయం మేరకు తాము సమగ్రమైన కులగణన చేపట్టామని ఆయన వెల్లడించారు. తమ నాయకుడు చెప్పిన ప్రకారం పారద్శకంగా కులగణన చేశామన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిన అవశ్యకత ఏర్పడుతుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే.. అన్ని రాష్ట్రాల్లో కులగణన జరిగితీరుతుందని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. కులగణనను కాపాడుకోకపోతే.. బీసీలే నష్టపోతారని సీఎం తెలిపారు. కులగణనను ఇంతకంటే పకడ్బందీగా చేసే రాష్ట్రం ఇకపై కూడా మరొకటి ఉండదన్నారు. కులగణన నివేదిక ఆధారంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో సూచనలు ఇవ్వండని కోరారు. బీసీల కోసం చేపట్టాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యాచరణపై సూచనలు ఇవ్వండని పిలుపునిచ్చారు. బీసీల జనాభా ప్రకారం వారికి అవకాశాలు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రెండో విడత పూర్తికాగానే నివేదిక చట్టబద్ధత కల్పిస్తామన్నారు. భవిష్యత్ లో ఎవరూ కోర్టుకు వెళ్లకుండా చూసేందుకే రెండో అవకాశం ఇచ్చాన్నారు. కులగణన సర్వేలో ఎక్కడ తప్పులు జరిగాయో నిరూపించండని సీఓం డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పించడంతో తన బాధ్యత నెరవేరుతోందన్నారు.

జనాభా దామాషా ప్రకారం ఏం కోరుకుంటున్నారో బీసీలే చెప్పాలని సీఎం కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi)కి చిత్తశుద్ధి ఉంటే జనగణన(Census of India)లో కులగణన కూడా చేయాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. మీరు లెక్కపెట్టకుండానే నా లెక్క తప్పని ఎలా అంటారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జనగణనలో కులగణన చేసి నా లెక్క తప్పని నిరూపించాలని డిమాండ్ చేశారు. అన్ని సామాజిక వర్గాల వారు ఎవరికి వారు తీర్మాణాలు చేయండన్నారు. మార్చి  10లోపు తీర్మాణాలు చేసి ప్రభుత్వానికి సమర్పించండని సూచించారు. మోడీకి కులగణన ఇష్టం లేదు కాబట్టే.. రాష్ట్రంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ వద్దని అంటున్నారని సీఎం రేవంత్ విమర్శించారు.