calender_icon.png 26 February, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర సాయం కోరిన సీఎం రేవంత్ రెడ్డి

26-02-2025 12:32:30 PM

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం

గంటకుపైగా సమావేశమైన సీఎం రేవంత్

రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు

ప్రధానికి ఎస్ఎల్ బీసీ ప్రమాద ఘటనను వివరించిన సీఎం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం ముగిసింది. ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి గంటకుపైగా సమావేశమయ్యారు. ఎస్ఎల్ బీసీ ప్రమాద ఘటనను రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు. పలు ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోరారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధానికి సీఎం విన్నవించారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా సాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్(Central budget) లోనూ రాష్ట్రానికి కేటాయింపులు లేవని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మూసీ నది ప్రక్షాళనకు కేంద్రం సహకరించాలని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్ బాబు, ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్, డీజీపీ జితేందర్ ఉన్నారు.