calender_icon.png 30 October, 2024 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ పోరాటంలో కీలకంగా ఉన్నది విద్యార్థులే : సీఎం రేవంత్ రెడ్డి

13-07-2024 07:37:09 PM

హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజులకు పెరుగుతున్న డ్రగ్స్, మహిళలపై జరుగుతున్న దాడులను ఆరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో వాలంటీర్లు అంశంపై కార్యక్రమాన్ని జేఎన్టీయూలో నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్, జేఎన్టీయూ వీసీ బుర్రా వెంకటేశం, సీపీలు, శ్రీనివాస్ రెడ్డి, అవినాష్, సుధీర్ బాబు పాల్గొన్నారు. 

తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించాలని, విద్యర్థి ప్రవర్తనలో మార్పు వస్తే తల్లిదండ్రులకు చెప్పాలని, పిల్లలకు మోరల్ పోలీసింగ్ నేర్పించాలని స్కూళ్లు, కళాశాలల యజమానులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మోరల్ పోలీసింగ్ చేయాల్సి బాధ్యత ఎన్ఎస్ఎస్ ది అని తెలిపారు. యూనిఫాం లేని పోలీసులు ఎన్ఎస్ఎస్ అని, డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించాం.. ఈ యుద్ధంలో ఎన్ఎస్ఎస్ కూడా కలిసి రావాలన్నారు. తెలంగాణ పోరాటంలో కీలకంగా ఉన్నది విద్యార్థులే. అలాంటి విద్యార్థులే ఇప్పుడు డ్రగ్స్ కు బానిసైతే సమాజం ఏమవ్వాలి? అని ప్రశ్నించారు.

బాధ్యత కలిగిన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని, పోలీసు ఉన్నతాధికారుల వారంలో 2 రోజులు స్కూళ్లు, కళాశాలలకు వెళ్లి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్లే పిల్లలు పక్కదారి పడుతున్నారు. విద్యార్థులందరూ మన పిల్లలే అనేలా చూసుకోవాలని, విద్యార్థులకు ఏది మంచో... ఏది చెడో చెప్పాల్సిన బాధ్యత మనందరీపై ఉందన్నారు. డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అవుతుందని సీఎం తెలిపారు. చదువుకుంటే ఉద్యోగం వస్తుందో.. రాదో తెలియదు కానీ క్రీడాకారులుగా రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా వస్తుందన్నారు. అందుకే క్రీడాకారులను మరింత ప్రోత్సహిస్తామన్నారు. యువత సమస్యలకు ఎప్పుడూ భయపడకూడదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.