తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని అబద్ధాలు చెబుతున్నారు..
ముంబయి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ముంబయి పీసీసీ కార్యాలయంలో సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు రుణమాఫీ చేశామని రేవంత్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని.. తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోడీ అబద్దాలు చెబుతున్నారని రేవంత్ కొట్టి పారేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు కానీ హామీలు ఇచ్చిందని మోడీ అన్నారు. తెలంగాణలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రూ. 2 లక్షల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. 22 లక్షల మంది రైతులకు రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేశామని వెల్లడించారు. రైతులకు మోడీ వేసిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చాక ప్రధాని డిలీట్ చేశారని చెప్పారు. తెలంగాణలో 10 నెలల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని సీఎం పేర్కొన్నారు.