calender_icon.png 28 February, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీపై కిషన్ రెడ్డి ఎందుకు విషం చిమ్ముతున్నారు?: సీఎం రేవంత్

28-02-2025 12:24:03 PM

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి  లేఖ రాసిని సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణకు నిధులు మంజూరు చేయించడం కిషన్ రెడ్డి నైతిక బాధ్యత

రాష్ట్ర ప్రాజెక్టుల అంశంలో కిషన్ రెడ్డి నిర్లక్ష్యం

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్రానికి నిధుల మంజూరు చేయించడం కిషన్ రెడ్డి నైతిక బాధ్యతని సీఎం సూచించారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి(Union Minister Kishan Reddy)గా ఉండగానే చెన్నై, బెంగళూరు మెట్రో విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపై పలుమార్లు విజ్ఞప్తి చేసినా పురోగతి లేదని ఆరోపించారు.

సబర్మతి, గంగా పునరుజ్జీవనంపై కిషన్ రెడ్డి పలుమార్లు ప్రకటనలు చేశారు. మూసీ(Musi Riverfront Renaissance)పై కిషన్ రెడ్డి ఎందుకు విషం చిమ్ముతున్నారు? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టుల అంశంలో కిషన్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రాజెక్టులపై మాట్లాడితే.. మమ్మల్ని అడగి ఇచ్చారా అంటూ విమర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నాది అవగాహనారాహిత్యమని కిషన్ రెడ్డి అనడం తీవ్ర అభ్యంతరకరమని సీఎం పేర్కొన్నారు. కేంద్రమంత్రి గా ఉన్న మీరు తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పండి? అని ప్రశ్నించారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం సమంజసంకాదని సూచించారు. ఇకనైనా రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం కోరారు.