ఖమ్మం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు బయలుదేరారు. భారీ వర్షాలతో ఖమ్మం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. వరద ప్రాంతాలను సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. రాత్రికి ఖమ్మంలోనే బస చేయనున్నారు. రేపు మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. మహబూబాబాద్ టౌన్ తో పాటు ఆకేరు, మున్నేరు పరివాహక గ్రామాలను పరిశీలించనున్నారు. మార్గమధ్యమంలో కోదాడను సీఎం రేవంత్ రెడ్డి విజిట్ చేయనున్నారు.