14-02-2025 07:54:06 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): విజయ తెలంగాణ పుస్తకాన్ని(Vijaya Telangana Book) జలవిహార్(Jalavihar) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు కేకే పాల్గొన్నారు. జలవిహార్ లో జరిగిన కార్యక్రమంలో మా హోంశాఖ మంత్యులు, మాజీ ఎంపీ తూళ్ళ దేవేందర్ గౌడ్(Former MP Tulla Devender Goud) తెలుగు, ఆంగ్ల భాషల్లో రచించిన విజయ తెలంగాణ పుస్తకాన్నిసీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తాను అభిమానించే నాయకులలో దేవేందర్ గౌడ్ మొదటి స్థానంలో ఉన్నారని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంసై చర్చ లోతుగా జరగాలని, ఒక కుటుంబమే పాల్గొన్నట్లు వక్రీకరించారని సీఎం మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వర్గాలు పాల్గొన్నాయని, ఉద్యమ చరిత్రపై సమగ్రమైన పుస్తకాలు రావాలన్నారు. దేవేందర్ గౌడ్ రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్ని ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కున్నారని, గోదావరి జలాలు తెలంగాణలో పారించేందుకు ఉద్యమం చేపట్టారని గుర్తు చేశారు. ఆయన పాదయాత్ర వల్లే ఆనాడు ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తి చేశారు.
ఉద్యమ సమయంలో ప్రజలంతా టీజీ అని బండ్లు, బోర్డులు, గుండెల మీద రాసుకున్నారని, తెలంగాణ ప్రజల కోరుకున్న విధంగానే ఇప్పుడు టీఎస్ ను టీజీగా మార్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ.. పదేళ్లు నివురుగప్పిన నిప్పులా ఉందన్నారు. జయజయహే తెలంగాణను ఇప్పుడు రాష్ట్ర గీతంగా మార్చామని, ఆనాడు ఉద్యమాన్ని ప్రభావితం చేసిన వాళ్లలో కొందరు ఆర్థికంగా మెరుగైన స్థితిలో లేరు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.