హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం గురువారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మొదటి విడుత రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. సీఎం చేతుల మీదుగా కొంతమంది రైతులకు రైతు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేశారు. తొలి విడుతలో రూ. లక్ష వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేశారు. 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమ చేశారు.
ఈ నెలాఖరునాటికి రూ. లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ, ఆగస్టు 15లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసిన ఆర్థిక శాఖ మూడు దశల్లో రుణాలు మాఫీకి ప్రభుత్వం నిర్ణయం ఇచ్చింది. రెండో విడుత రుణమాఫీకి రూ.8 వేల కోట్లు అవసరమని అంచనా, రూ.లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయగా, మూడో విడుత రుణమాఫీకి రూ.15 వేల కోట్లు అవసరమని అంచన వేయగా.. రైతుల ఖాతాల్లో ఆగస్టు 15లోపు నగదు జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డు ప్రామాణికంగా రుణమాఫీ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. రుణమాఫీకి ప్రామాణికం పాస్ పుస్తకమే.. రేషన్ కార్డు కాదన్నారు. గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేసిందని, వాటికి ప్రతి నెలా రూ.7 వేల కోట్లు వడ్డి చెల్లిస్తున్నామని సీఎ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.