calender_icon.png 25 September, 2024 | 6:07 PM

సామాజిక దృక్పథంతో పనిచేసే పరిశ్రమలను ప్రోత్సహిస్తాం

25-09-2024 02:40:50 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రాంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. మాసబ్ ట్యాంకులో ఏర్పాటు చేసిన బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ స్కిల్ మైనర్ డిగ్రీ కోర్స్ 38 కళాశాలలో ప్రారంభంకానుంది.  18 ఇంజనీరింగ్, 20 నాన్ ఇంజనీరింగ్ కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని ఆయన పేర్కొన్నారు. కోర్స్ ద్వారా విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో డిగ్రీ విద్యార్థులకు 18 క్రెడిట్స్, ఇంజనీరింగ్ విద్యార్థులకు 20 క్రెడిట్ పాయింట్స్ అవసరమైన స్కిల్స్ అందించనున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు.

నేటి తరం విద్యార్థులను దృష్టిలో ఉంచుకోని అందరితో సంప్రదింపులు జరిపామని,  ఈ కోర్స్ ద్వారా 5 లక్షల మేరకు ఉద్యోగవకాశాలు ఉంటాయన్నారు. 6 నెలలు ఫీల్డ్ లెవల్ ట్రైనింగ్ ఉంటుందని, రూ.25 వేలతో మొదలుపెడతామన్నారు. ఈక్విప్ సంస్థ 10 వేల మందికి ఫీజు కడుతున్నారని, పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. సామాజిక దృక్పథంతో పనిచేసే పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఆసక్తి ఉన్న విద్యార్థులందరికీ అండగా నిలుస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.