calender_icon.png 25 September, 2024 | 6:00 PM

బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రాంను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

25-09-2024 03:49:58 PM

హైదరాబాద్, (విజయక్రాంతి): మాసాబ్ ట్యాంక్ లోని జేఎన్ఎఎఫ్ఎయూలో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రాంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సామాజిక దృక్ఫథంతో పని చేసే పరిశ్రమలను ప్రోత్సహిస్తామని, ఆసక్తి ఉన్న విద్యార్థులందరకీ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సౌకర్యాలు వినియోగించుకుని విద్యార్థులు జీవితంలో ఎదగాలని,  నిరుద్యోగుల సమస్యలను గుర్తించాం.. అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టాం.. అని సీఎం తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, వెబ్ సైట్ లో 30 లక్షల మంది యువత పేర్లు నమోదు చేసుకున్నారని, డిగ్రీ చదివిన 50 లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. మరో 35 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన నిరుద్యోగ సమస్య తీరదని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

కానీ నిరుద్యోగ సమస్య తీవ్రతను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని, రాష్ట్రంలో ఏటా 3 లక్షల మంది పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ గ్రామాలను, వ్యవసాయాన్ని నమ్ముకున్న వాళ్లు మనవద్ద ఎక్కువ యువత వద్ద సర్టిఫికెట్లకు, మార్కెట్ లో ఉన్న ఉద్యోగాలకు పొంతన కుదరడం లేదని స్పష్టం చేశారు. ఉపాధి అవకాశాలపై ఎలాంటి కోర్సులు చదివినవారు కావాలని పరిశ్రమల యాజమన్యాలను అడుతున్నామని,  నిరుద్యోగ యువత డిమాండ్ - సప్లయ్ సూత్రం గుర్తుంచుకోవాలని సీఎం సూచించారు. డిగ్రీ చదివేవారు భవిష్యత్తు దిశగా ఆలోచించాలి, సీఎస్ఆర్ కింద నిధులు సేకరించి మీకు అండగా నిలుస్తున్నారు. బ్యాంకులు, బీమా రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. కానీ నాయకుడిగా రాణించాలన్నా నైపుణ్యం ఉండాలని, ఉద్యోగాలు, ఉపాధి లేకుంటే యువత చెడు వ్యసనాల వైపు వెళ్లే ప్రమాదం ఉందన్నారు.