calender_icon.png 27 December, 2024 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే

26-12-2024 12:27:12 PM

హైదరాబాద్: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ దిల్ రాజు (Dil Raju) ఆధ్వర్యంలో సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమావేశం కొనసాగుతోంది. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమావేశం జరుగుతోంది. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని, బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని హెచ్చరించారు. అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత టాలీవుడ్ (Tolly wood) సెలబ్రిటీలదేనన్నారు. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉందని సీఎం భరోసా ఇచ్చారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలన్నారు. డ్రగ్స్‌ క్యాంపెయిన్‌, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలని పిలుపునిచ్చారు. టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని కోరారు. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.