పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్‌యాదవ్
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం యాదవుల సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తించి సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించడంపై అఖిల భారత యాదవ మహాసభ హర్షం వ్యక్తం చేసింది.
ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబురావు యాద వ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవీంద్రనాథ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపా రు. నామినేటెడ్ పదవుల్లోనూ యాదవులకు సముచిత స్థానం కల్పించాలని బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు.