25 May, 2026 | 5:14 AM

మరో పాతికేళ్లు కాంగ్రెస్ పాలనే

25-05-2026 12:37 AM

సీఎం రేవంత్‌రెడ్డి దేవుడిచ్చిన సోదరుడు 

రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి

వరంగల్, మే 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, పార్టీ పట్టిష్టతకు కృషి చేస్తే రాబోవు 25 ఏళ్ల కాలం పాటు రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, సీఎం రేవంత్‌రెడ్డి తనకు దేవుడు ఇచ్చిన సోదరుడని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి అన్నారు.

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని హనుమకొండలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న కాంగ్రెస్ కార్యకర్తల పోరాట ఫలితంగానే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.

బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ నిజమైన వేదిక అని, ఆ భావజాలానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ఓరుగల్లు అభివృద్ధి కోసం 2,200 కోట్లతో 11 నియోజకవర్గాల్లో యం గ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో జనగామ నియోజకవర్గానికీ విస్తరిస్తామని తెలిపారు.

రాబోయే గ్రేటర్ వరంగల్ ఎన్నికలు కొత్త సవాల్ అని, దేశంలోనే జీడబ్ల్యూఎంసీకి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రాజకీయాల్లో అవకాశాలు పొం దిన పది శాతం మంది నేతలు మిగతా తొంభై శాతం కార్యకర్తలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. జూలైలో మామునూర్ ఎయిర్‌పోర్టు శంకుస్థాపనకు ప్రధాని హాజరవుతారని, జూన్‌లో టెండర్లు పూర్తవుతా యని వెల్లడించారు. త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు టెండర్లు పిలుస్తామని, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు.