calender_icon.png 17 November, 2024 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు కచ్చితంగా జాబ్ కొట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి

20-07-2024 12:12:40 PM

హైదరాబాద్: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రజాభవన్ లో ప్రారంభించారు. సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన ఒక్కో అభ్యర్థికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేకూరనుంది. సివిల్స్ ప్రిమిల్స్ లో తెలంగాణ నుంచి 41 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ కార్యక్రమానికి సింగరేణి సీఎండీ బలరాం హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... నిరుద్యోగ సమస్య పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని సీఎం వెల్లడించారు. ప్రభుత్వంపై అభ్యర్థులకు నమ్మకం కలగాలనే త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నామని స్పష్ట చేశారు. జూన్ 2న నోటిఫికేషన్, డిసెంబర్ 9లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలెండర్ రూపొందించామన్నారు.

సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం తరుఫున సాయం చేస్తోందన్నారు. మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులు కచ్చితంగా జాబ్ సాధించాలని ఆయన కోరారు. సివిల్స్ సాధించి మన రాష్ట్రానికే రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఐఏఎస్, ఐపీఎస్ లు మనవారైతే రాష్ట్రానికి మంచి జరుగుతోందని సీఎం పేర్కొన్నారు. పరీక్షలు మాటిమాటికి వాయిదా పడడం మంచిది కాదని ఆయన తెలిపారు. నిరుద్యోగుల బాధలు తమకు తెలుసన్న సీఎం రేవంత్ అభ్యర్థుల సమస్యలను అర్ధం చేసుకుని గ్రూప్-2 పరీక్ష వాయిదా వేశామని పేర్కొన్నారు.