calender_icon.png 27 December, 2024 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇకపై బెన్‌ఫిట్ షోలు బంద్.. టాలీవుడ్‌కి సీఎం షాక్

26-12-2024 01:08:55 PM

హైదరాబాద్: సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) సమావేశం ముగిసింది. రెండు గంటల పాటు సాగిన సమావేశంలో ప్రభుత్వం తమ వైఖరిని సినీ ప్రముఖులకు స్పష్టం చేసింది. టాలీవుడ్ (Tollywood) సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. టాలీవుడ్‌కు తాము వ్యకిరేఖం కాదన్న సీఎం టాలీవుడ్‌ సమస్యల పరిష్కారానికి ముందుంటామన్నారు. తెలంగాణ (Telangana) లో షూటింగ్‌లకు మరిన్ని రాయితీలు కల్పించాలన్న విజ్ఞప్తిపై కమిటీ వేస్తామని తెలిపారు. ముందస్తు అనుమతులు, తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి ఇస్తామని చెప్పారు. ఇకపై తెలంగాణలో బెన్‌ఫిట్ షోలు (Benefit show), స్పెషల్‌గా టికెట్ రేట్ల పెంపు ఉండదన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా హీరోగా ఉండాలని, సినీ పరిశ్రమకు సామాజిక బాధ్యత ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.

అందరు సీఎంలు సినీ పరిశ్రమను బాగానే చూసుకున్నారని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సినీ పరిశ్రమను బాగా చూసుకుంటోందని చెప్పారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ (International Film Festival) నిర్వహించాలని కోరుకున్నామని రాఘవేంద్రరావు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో స్టూడియో నిర్మాణం ఉండాలని హీరో నాగార్జున తెలిపారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తేనే సినీ పరిశ్రమ ప్రపంచస్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటిల్ కావాలనేది తమ కోరికని అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తెలిపారు. ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎంతో భేటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.