హైదరాబాద్,(విజయక్రాంతి): డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ విగ్రహ ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. డిసెంబర్ 9న విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించిన నేపథ్యంలో పని చేస్తున్న కూలీలను పలకరించి, పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నామని ముఖ్యమంత్రి ఇంతకుముందే చెప్పిన విషయం తెలిసిందే.