హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకున్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగే క్రేన్ ను, వద్ద పరిస్థితులను పరిశీలించారు. అనంతరం క్రేన్ డ్రైవర్ తో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆరా తీశారు. ఈ సందర్భంగా నగర సీపీ సీవీ ఆనంద్ ను గణేష్ నిమజ్జన్నానికి సంబంధించిన ఏర్పాట్లు గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.
క్రేన్ డ్రైవర్స్, ఇతర సిబ్బందికి అపుడప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మూడు షిఫ్టుల్లో డ్రైవర్స్ , ఇతర సిబ్బందికి విధులు కేటాయించేలా జాగ్రత్తలు తెరసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మీ తదితరులు ఉన్నారు.