24-02-2025 12:25:09 PM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం నాడు హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోనే ఆమ్‌జెన్ బయోటెక్నాలజీ ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu), ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఆమ్‌జెన్ సంస్థ(AMGEN) హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ లో విస్తృత అవకాశాలు ఉన్నాయని సీఎం సూచించారు. హైదరాబాద్ అత్యంత వేగంగా ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని రేవంత్ రెడ్డి చెప్పారు. విదేశీ కంపెనీ ప్రతినిధులకు సరిపోయే పరిస్థితులు నగరంలో ఉన్నాయని ఆయన వివరించారు.