25-02-2025 11:53:45 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో బయో ఆసియా-2025( Bio Asia 2025) సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా హైదరాబాద్ మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ లో గొప్ప నిపుణులు ఉన్నారని వెల్లడించారు.
హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ రాబోతున్నాయని ముఖ్యమంత్రి సూచించారు. భారత్ లోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కేంద్రంగా హైదరాబాద్ మారిందని తెలిపారు. హైదరాబాద్ ను సరికొత్త ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడి ఎకో సిస్టం అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తోందన్నారు. తమ ప్రభుత్వ విధానాలు చూసి అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రంగా తెలంగాణ మారిందని వివరించారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో మిగితా రాష్ట్రాల కంటే ముందున్నామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కు వచ్చే కంపెనీల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.