21-04-2025 11:37:31 AM
హైదరాబాద్: జపాన్ లోని ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఐటీమంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఒసాకా ఎక్స్(Osaka Expo 2025) పోలో పాల్గొన్న భారత్ లోని తొలిరాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. ఒసాకా ఎక్స్ పో వేదికగా తెలంగాణ ప్రత్యేకతలు చాటిచెప్పేలా ఏర్పాట్లు చేశారు. పారిశ్రామిక అనుకూలతలు, పర్యాటక ఆకర్షణలు చాటిచెప్పేలా ఏర్పాట్లు చేశారు. జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy Japan Tour) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటుంది.