హైదరాబాద్: గోపనపల్లి ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. జెండా ఊపి ఫ్లైఓవర్ పై ఉమెన్ బైకర్స్ ను సీఎం రేవంత్ రెడ్డి అనుమతించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొన్నారు. గోపన్‌పల్లి దాని పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలకు బాగా ఉపయోగపడనుంది. తొలుత జూన్‌లో ప్రారంభోత్సవం చేయాలని భావించినా పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్లైఓవర్‌ను ప్రారంభించడంలో జాప్యం జరిగింది. హెచ్‌సీయూ బస్టాప్ నుంచి వట్టినాగులపల్లి మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ లేకుండా చేసేందుకు ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టారు.