calender_icon.png 13 February, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ ప్రారంభం

13-02-2025 01:30:52 PM

భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే

మైక్రోసాప్ట్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్(Microsoft New Office)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) గురువారం ప్రారంభించారు. హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ తో మైక్రోసాప్ట్ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ కృషితో 500 పాఠశాలల్లో ఏఐ భోదిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.