21-02-2025 03:39:34 PM
నారాయణపేట,(విజయక్రాంతి): నారాయణపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పర్యటించారు. అప్పక్ పల్లెలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన సీఎం మహిళా సమాఖ్య పెట్రోల్ బంకు ప్రారంభించారు. నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలలో భవనాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.130 కోట్లతో వైద్య కళాశాల, హాస్టల్ నిర్మాణం, రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణం చేపట్టానున్నారు. అలాగే నారాయణపేటలో రూ.40 కోట్లతో వంద పడకల యూనిట్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం వైద్య విద్యార్థులతో ముఖ్యమంత్రి సంభాషించారు. రాష్ట్రంలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని, మహిళా సంఘాలను బలోపేతం చేయాలని నిర్ణయించామన్నారు. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. మహిళా సంఘాలు మరింత ఆర్థికంగా ఎదగాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.