calender_icon.png 17 November, 2024 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌తో శేరిలింగంపల్లి అభివృద్ధి: సీఎం రేవంత్‌ రెడ్డి

20-07-2024 02:42:36 PM

గోపనపల్లి ఫ్లైఓవర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణకు 65 శాతం ఆదాయం జంట నగరాల నుంచే

హైదరాబాద్: తెలంగాణకు 65 శాతం ఆదాయం జంట నగరాల నుంచే వస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోపనపల్లి ఫ్లైఓవర్ ను ప్రారంభించిన సందర్భంగా అన్నారు. హైదరాబాద్ కు ఎవరు వచ్చినా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గోపనపల్లి ఫ్లైఓవర్ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ధి చెందుతోందని సీఎం తెలిపారు. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. దేశ నలుమూలల నుంచి ఎవరు వచ్చినా హక్కున చేర్చుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి హైడ్రా ద్వారా వ్యవస్థను తీసుకువస్తున్నామన్నారు. చిన్న వరం పడినా మన కాలనీలు మురికికాల్వలు అయిపోతున్నాయని సీఎం పేర్కొన్నారు. మూసీని అభివృద్ధి చేసే బాధ్యత తమదన్నారు. ఐదేళ్లలో 1.50 లక్షల కోట్లతో మూసీనదిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొన్నారు.