భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వారావు పేట నియోజకవర్గం పరిధిలోని అశ్వరావుపేట నియోజకవర్గం పూసగూడెంలోని సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం మోటార్లను ఆన్ చేశారు. డిస్పాచ్ ఛానల్ వద్ద గోదావరి జలాలకు పుష్పాలను చల్లి సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల,పొంగులేటి,ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వాగతం పలికారు. ప్రాజెక్టును ప్రారంభించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతాంగానికి అంకితం చేశారు.