calender_icon.png 27 November, 2024 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

500 బోనస్ ఇవ్వడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం

27-11-2024 08:46:47 PM

కామారెడ్డి (విజయక్రాంతి): 500 బోనస్ ఇవ్వడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి రైతులు పాలభిషేకం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తానని హమి ఇచ్చి ఇచ్చిన మేరకు నేరవేర్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి రవీందర్‌రెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. రైతులకు ఇచ్చిన హమీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సన్నరకం ధాన్యం విక్రయించిన రైతులకు వారి ఖాతాల్లో క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోసుల మల్లయ్య, నర్సింలు, ఎస్.కె. ఉమర్, కృష్ణ, సుమన్, కూల్‌రేపు సాయిలు, చింత శ్రీనివాస్, చింత గోపాల్, బాలయ్య, గుల్ల పెద్ద రాజు, ఎస్.కె. కాజా, గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు.