18-04-2025 09:25:04 AM
సాయంత్రం సుమిదా రివర్ ఫ్రంట్ ను సందర్శించనున్న సీఎం
నేడు జపాన్ కు చేరుకోనున్న మంత్రి శ్రీధర్ బాబు
ఈ నెల 21న ఒసాకాలోని యుమెషియాలో వరల్డ్ ఎక్స్ పో
టోక్యో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్(Revanth Reddy Japan Tour)లో పర్యటిస్తోంది. రేవంత్ రెడ్డి(Revanth Reddy) శుక్రవారంనాడు జపాన్ లోని ప్రముఖ కంపెనీలతో సమావేశం కానున్నారు. టోక్యోలోని గాంధీ విగ్రహానికి(Gandhi statue) సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించనున్నారు. అనంతరం టోక్యో గవర్నర్(Tokyo Governor)తో సీఎం బృందం సమావేశం కానుంది. భారత రాయభార కార్యాలయంలో పరిశ్రమల ప్రతినిధులతో సీఎం చర్చించనున్నారు. టయోటా, తొషిబా, ఐసిన్, ఎన్టీటీ కంపెనీ సీఈఓలతో వేర్వేరుగా చర్చించనున్నారు. సాయంత్రం సుమిదా రివర్ ఫ్రంట్ ను రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు.
ఇవాళ తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు(IT Minister Sridhar Babu) జపాన్ కు చేరుకోనున్నారు. ఈ నెల 21న ఒసాకాలోని యుమెషియాలో వరల్డ్ ఎక్స్ పో ప్రారంభం కానుంది. ఈ నెల 21న ఒసాకా రివర్ ఫ్రంట్ ను సీఎం బృందం పరిశీలించనుంది. ఈ నెల 22న సీఎం బృందం ఒసాకా నుంచి హిరోషిమా వెళ్లనుంది. హిరోషిమా జపాన్- ఇండియా చాప్టర్ బిజినెస్(Japan-India Chapter Business)లో ప్రతినిధులతో సీఎం చర్చించనున్నారు. సీఎం బృందం టోక్యో మెట్రోను పరిశీలించింది. ముఖ్యంగా టోక్యో మెట్రో పనితీరు, 9 లైన్లతో నడుస్తున్న మెట్రోకు ఉపయోగిస్తున్న సాంకేతికత, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంలో మెట్రో సమర్థవంతంగా సేవలను అందిస్తున్న తీరుతో పాటు ఇతర అంశాలపై ఈ ప్రతినిధి బృందం పరిశీలించింది.