06-04-2025 10:37:50 AM
భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బూర్గంపాడు మండలంలో పర్యటించనున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి హుజూర్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ పథకం(Fine Rice Distribution Scheme) ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం సారపాకలోని తాళ్ల గుమ్మూరు గ్రామానికి చెందిన సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస రావు ఇంట్లో భోజనం చేసేందుకు విచ్చేయనున్నారు. సన్నబియ్యం లబ్దిదారుడి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బూరం శ్రీనివాసరావు గృహంలో ఆహార పదార్థాలను వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) పరిశీలించారు.