హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గ్రూప్-4లో ఉద్యోగాలు సాధించిన 98 మంది అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. స్కిల్ వర్శిటీలో భాగమయ్యే సంస్థలతో చేసుకున్న ఒప్పందంపై సంతకాలు చేశారు. అలాగే పెద్దపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు, డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ పై ఎంఓయూకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అనంతరం సీఎం కప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.