13-03-2025 12:24:43 AM
మద్నూర్,(విజయక్రాంతి): హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమంలో భాగంగా బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండలంలోని, ఇందిరానగర్ కాలనీ చెందిన విశ్వజిత్ కాంబ్లె, కు హిందీ జూనియర్ లెక్చరర్ గా మద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోస్టింగ్ ఇచ్చారు. మద్నూర్ మండలంలోని ఖరగ్ గ్రామానికి చెందిన డి. జ్ఞానేశ్వర్ కు జూనియర్ లెక్చరర్ గా నారాయణఖేడ్ లో పోస్టింగ్ ఇచ్చారు మద్నూర్ మండలంలోనిగోజెగావ్ గ్రామానికి చెందిన సంభాజకి హిందీ జూనియర్ లెక్చరర్ గా ప్రభుత్వ జూనియర్ కళాశాల గాంధారిలో పోస్టింగ్ ఇచ్చారు.వీరందరూ కూడా హిందీ జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపిక అయ్యారు.