హైదరాబాద్: స్వతంత్ర భారత రూపశిల్పి, దేశ తొలి ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ జయంతి పురస్కరించుకుని నిర్వహించుకునే ‘జాతీయ బాలల దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాలబాలికలకు అందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లలు జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని బోధించిన పండిట్ నెహ్రూ ఆకాంక్షల మేరకు నేటి పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం కోరారు. నెహ్రూ సేవలను స్మరిస్తూ వారికి నివాళులు అర్పించారు.