హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఇతర నేతలు వెళ్లారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ న్యూస్ మేకర్స్ అడ్డాలో ముఖ్యమంత్రి చిట్ చాట్ చేయనున్నారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీకానున్నారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై, మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ ముఖ్యనేతలతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఝార్ఖండ్, మంత్రులు ఉత్తమ్ కుమర్ రెడ్డి, సీతక్క మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.