రంగారెడ్డి: తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమర్ తో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. 57 ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ నిర్మించనున్నారు. స్కిల్ యూనివర్సిటీతో పాటు మరో 4 సెంటర్లకు అనగా.. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, మోడ్రన్ స్కూల్, కమ్యూనిటీ సెంటర్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.