calender_icon.png 5 January, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో రండి చూసుకుందాం

16-09-2024 06:16:23 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాజీవ్ గాంధీ చర్యల వల్లే ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేశారని, కేటీఆర్ కూడా ఐటీ చదివి అమెరికా వెళ్లారని ముక్యమంత్రి వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ పరిచయం చేయకపోతే కేటీఆర్ నువ్వు ఎక్కడ ఉండేవాడివి..? అని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆ పదవిని సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ తీసుకోలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. పదవి త్యాగం అంటే సోనియా, రాహుల్ గాంధీది అని, తెలంగాణ బిడ్డ పీవీని ప్రధాన మంత్రిని చేసింది సోనియాగాంధీ కాదా..?, గాంధీ కుటుంబం గురించి కేసీఆర్ కుటుంబానికి ఏం తెలుసు..? అని ప్రశ్నించారు. అడ్డగోలుగా మాట్లాడితే చూస్తు ఊరుకుంటామనుకున్నారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెడదామనుకున్నారట.. 10 ఏళ్లు గడిచిన ఎందుకు పెట్టాలేదు. ఫామ్ హౌస్ లు కట్టుకున్నావు.. రూ. లక్ష కోట్లు మింగి కాళేశ్వరం కట్టుకున్నావు.. తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.  కేసీఆర్ విగ్రహం పెట్టుకోడానికి ఇక్కడ స్థలం ఉంచుకున్నారని ఆరోపించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో రండి చూసుకుందాం అని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.