మంథని (విజయక్రాంతి): మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఆప్తమిత్రుడు, ఇటీవల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహితగా అవార్డు అందుకున్న తాడూరి సంపత్ కుమార్ ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి మెమోంటో, శాలువాతో ఘనంగా సత్కరించారు. సంపత్ కు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రులు, సవాయి గణేష్, చాట్లపల్లి సంతోష్ ,తదితరులు పాల్గొన్నారు.