31-03-2025 10:47:34 AM
హైదరాబాద్: రంజాన్ పండుగ(Ramadan Festival) లౌకిక వాదానికి మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Chief Minister Anumula Revanth Reddy) అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, కరుణ, ఐకమత్యం సందేశాలతో సేవాతత్పరత, ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈద్ ఉల్ ఫితర్(Eid al-Fitr) పర్వదినం సందర్భంగా అల్లా కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని సూచించారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం(Telangana State) సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేందుకు అల్లా దువా ఉండాలి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.