calender_icon.png 26 February, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

26-02-2025 11:29:31 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు ప్రసాదించాలని శివుడిని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి సందేశంలో పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన శివనామస్మరణతో శైవక్షేత్రాలు(Lord Shiva Templesమార్మోగుతున్నాయి. వేములవాడ, సంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో శంభో శంకరుడికి భక్తులు ప్రత్యేకపూజలు  చేస్తున్నారు.  పుణ్యస్నానాలాచరించి ముక్కంటి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తజనంతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి.